Monday, April 29, 2024

తమిళ హీరో సూర్యకు హెచ్చరికలు

సినిమాటోగ్రఫీ చట్టం 1952 సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హీరో సూర్య విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుట కోసం చట్టాలు చేయాలని ఆ స్వేచ్ఛను నాశనం చేయడం కోసం కాదని చెప్పుకొచ్చారు సూర్య. కాగా తమిళనాడు బీజేపీ విభాగం ఇదే విషయంపై సూర్యకు హెచ్చరికలు జారీ చేసింది.

సూర్య తన సినిమాల గురించి మాత్రమే పట్టించుకోవాలని ఇతర విషయాలపై అనవసరంగా జోక్యం చేసుకుంటూ ప్రచారాలు చేస్తే బాగోదని హెచ్చరించింది. తన తీరు మార్చుకోకపోతే న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. మరి సూర్య దీనిపై ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement