Saturday, May 4, 2024

బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో షారుక్ ఫ్యామిలీ.. వైర‌ల్ గా ఫొటోలు

తమ కుటుంబంతో కలిసి తాజాగా ఓ ఫొటోషూట్లో పాల్గొన్నారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, ఆయ‌న భార్య గౌరీ ఖాన్ . ఇందులో వారి పిల్లలు పిల్లలు అబ్రామ్, ఆర్యన్ ఖాన్, సుహానా ఖాన్ పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్‌గా బిజీగా ఉంటోంది. అలాగే తన భర్త సినిమా వ్యవహారాల్లో అండగా నిలుస్తోంది. ఇక షారుఖ్ ఖాన్-గౌరీ ఖాన్ దంపతుల పిల్లలు కూడా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు.
ముఖ్యంగా సుహానా ఖాన్ ఇప్పటికే బోలెడంత క్రేజ్‌ సంపాదించుకుంది. అలాగే పలు ప్రతిష్టాత్మక బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇక కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా త్వరలోనే సినిమాల్లోకి రానున్నట్లు సమాచారం.ఇప్పుడీ ఫొటోలు వైర‌ల్ గా మారాయి.కాగా ప‌ఠాన్ చిత్రంతో క‌మ్ బ్యాక్ అయ్యాడు షారుక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement