Friday, April 26, 2024

నాని కోసం భారీ బడ్జెట్ తో సెట్…ఈ సీన్ లే ఇంపార్టెంట్ !!

నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా తో పాటు శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కి యూనిట్ సిద్ధం అవుతుంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాదులో కోలకత్తా నగరానికి సంబంధించిన ఒక సెట్ ను తయారు చేశారట. ఈ సెట్ ను 6.50 కోట్ల రూపాయలతో అవినాష్ కొల్లా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో నాని ఇదివరకు ఎప్పుడూ కనిపించని సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. అయితే ఈ షెడ్యూల్లో చిత్రీకరించే సన్నివేశాలు చాలా క్లిష్టమైనవని, వాటి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ సెట్ ను నిర్మించి చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement