Monday, May 6, 2024

లాక్ డౌన్ వ‌ద్దంటూ కెసిఆర్ కు పారిశ్రామిక వేత్త‌లు మొర‌

హైదరాబాద్‌, : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో ఆందోళ నపడుతున్న తెలంగాణ పరిశ్రమ వర్గాలు మరోసారి లాక్‌డౌన్‌ వద్దని ప్రభుత్వానికి సూచిస్తున్నాయి. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీటింగ్‌ (ట్రిపుల్‌ టి) మంత్రంతోనే కోవిడ్‌కు కళ్లెం వేయాలి తప్ప లాక్‌డౌన్‌ లాంటి చర్యలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు గురవుతుందని పేర్కొంటున్నాయి. ఈ విష యమై పలు పరిశ్రమల అసోసియేషన్‌లు ఇప్పటికే ప్రభుత్వా నికి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తులకు ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించిందని సమా చారం. కేంద్రం కూడా ఈసారి లాక్‌డౌన్‌కు సానుకూలంగా లేకపోవ డంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మార్గదర్శకాల ప్రకా రం వెళ్లాలని నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు.
అంక్షలు విధించిన రాష్ట్రాల్లోనూ పరిశ్రమలు యథాతథం
ఇటీవల కోవిడ్‌ కేసులు పెరిగి కర్ఫ్యూ ఆంక్షలు విధించిన రాష్ట్రాల్లోనూ పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్యకలాపాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశ్రమల అసోసియేషన్‌ల ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. తయారీ రంగంలో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నందున ఈ రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటేనే మంచిదని వారు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే లాక్‌డౌన్‌, కర్ఫ్యూ ఉండబోదని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించినప్పటికీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన నెలకొందని కోవిడ్‌ నియంత్రణ విషయమై ప్రభుత్వం స్పష్టమైన విధానం అవలంబించాలని వారు కోరుతున్నారు.
లాక్‌డౌన్‌ వద్దంటూ సీఎం కేసీఆర్‌కు ఫిక్కీ విజ్ఞప్తి
రాష్ట్రంలో లాక్‌డౌన్‌ లేదా పాక్షిక లాక్‌డౌన్‌లు ఏవీ వద్దని జాతీయ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సీఎం కేసీఆర్‌కు ఒక లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధిస్తే ఆర్థిక వ్యవస్థ కుదే లవుతుందని ఫిక్కీ అధ్యక్షుడు ఉదయశంకర్‌ ఆ లేఖలో పేర్కొ న్నారు. గతేడాది విధించిన లాక్‌డౌన్‌తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడే కోలుకోవడం ప్రారంభించిందని తెలిపారు. మాస్కులు, శానిటైజర్లు వాడుతూ కోవిడ్‌ జాగ్రత్తలన్నీ పక్కా గా తీసుకోవడమే ప్రస్తుతం వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడానికి ప్రస్తుతమున్న ఆయుధాలని పేర్కొన్నారు. టెస్టుల సంఖ్య పెంచి కోవిడ్‌ జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించమే పరిష్కారమని సూచించారు. కోవిడ్‌ నిబంధనలు ఉల్లం ఘించిన వారిపై భారీ జరిమానాలు విధించాలని కోరారు.
గతేడాది లాక్‌డౌన్‌తో పరిశ్రమలపై అధికమైన రుణ భారం
గతేడాది కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు ఆగిపోయి వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లు, టర్ము లోన్లు అధికంగా తీసుకోవాల్సి వచ్చి రుణ భారం మరింత పెరిగిపోయిందని పలువురు పరిశ్రమల యజమానులు వాపో తున్నారు. వలస కార్మికులు తిరిగి వచ్చి ఇప్పుడిప్పుడే ఆర్డర్లు తీసుకొని వ్యాపారం పూర్తిస్థాయిలో ప్రారంభించి గతేడాది అప్పులు తీర్చే ప్రయత్నాల్లో ఉన్నామని, ఇంతలో మళ్లి లాక్‌ డౌన్‌ అంటే వేలాది చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిగా మూతపడక తప్పదని వారు పేర్కొంటున్నారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్యాకేజీ కింద రాష్ట్రంలోని చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు కేంద్రం గ్యారంటీతో బ్యాంకుల నుంచి రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకుని కొంత వరకు ఉపశమనం పొందాయని, మళ్లి లాక్‌డౌన్‌ విధిస్తే కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు కూడా సాయం చేసే పరిస్థితి ఉండదని వారు వాపోతున్నారు.
ఇప్పటికే రూ.2500 కోట్ల పారిశ్రామిక రాయితీలు బకాయిలు
కోవిడ్‌ సంక్షోభం కారణంగా రాష్ట్రంలోని చిన్న, పెద్ద పరిశ్రమలన్నింటికీ కలిపి రూ.2500 కోట్ల దాకా ప్రభుత్వం బకాయి పడింది. ఈ రాయితీలన్నీ ఈ ఏడాదిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాయితీలు సకాలంలో రాక చాలా పరిశ్రమలు ఇబ్బందుల పాలయ్యాయని, ప్రస్తుతం లాక్‌డౌన్‌ పెడితే ప్రభుత్వం ఈ ఏడాది కూడా రాయితీలు చెల్లించే పరిస్థితి ఉండదని పరిశ్రమల సమాఖ్యల ప్రతినిధులు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement