Tuesday, May 21, 2024

మేమ్ ఫేమ‌స్ మరో సాంగ్ రిలీజ్….

‘రైటర్‌ పద్మభూషణ్‌’ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్‌, చాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్ర పోషి స్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అనురాగ్‌ రెడ్డి, శరత్‌, చంద్రు మనోహరన్‌ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రధారులు.
కళ్యాణ్‌ నాయక్‌ సంగీతం అందించిన ఫస్ట్‌ సింగిల్‌ ”అయ్య య్యా…”కి మంచి స్పందన వచ్చిం ది. ఇప్పుడు, సెకండ్‌ సింగిల్‌ మిని మమ్‌ను విడుదల చేశారు. ఇది మొ దటి దానికి పూర్తిగా భిన్నమైన ట్రాక్‌. ఈ మాస్‌ నెంబర్‌ యూత్‌ స్టయిల్‌ స్వాగ్‌ ని చూపుతుంది. సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల , మౌర్య చౌద రి దినచర్యను ప్రజెంట్‌ చేసింది. వారు రోజంతా చిల్‌గా ఉంటారు. ఎవరినీ పట్టించుకోరు.


రాహుల్‌ సిప్లిగంజ్‌ ఈ పాట పాడారు. కోటి మామిడాలతో కలసి సాహిత్యం అందించారు. సుమంత్‌ ప్రభాస్‌, మణి ఏగుర్ల, మౌర్య చౌదరి గ్రామీణ ప్రాంతాల్లో చిచోరా బ్యాచ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శ్యామ్‌ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తు న్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్‌, అరవింద్‌ మూలి ఆర్ట్‌ డైరెక్టర్‌. మేమ్‌ ఫేమస్‌ జూన్‌ 2న విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement