Wednesday, May 15, 2024

SSMB29 | స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్.. త్వ‌ర‌లోనే రాజమౌళి, మ‌హేష్ బాబు సినిమా !

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక అభిమానుల చూపులన్నీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న SSMB29 మీదే ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కాగా, తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని రైటర్ విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యిందని.. ఫైనల్ స్క్రిప్ట్ లాక్ అయ్యిపోయినట్లు తెలిపారు.

ఈ మూవీలో చాలా వరకు గ్రాఫిక్స్ తోనే పని ఉండబోతుందని తెలుస్తుంది. దానికి తగ్గట్లు మహేష్ కి ప్రీ విజువలైజేషన్ పై ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ చేయబోతున్నట్లు విజయేంద్రప్రసాద్ తెలియజేశారు. ఈ వార్తలతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement