Monday, April 29, 2024

Sanjay Dutt – డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ బుల్ వ‌చ్చేశాడు..

పూరి తన సొంత బ్యానర్లో రామ్ హీరోగా హిట్ కొట్టిన ‘ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ వ‌స్తున్న మూవీ డ‌బుల్ ఇస్మార్ట్. ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ ను తీసుకున్నారు. ఆయన పాత్ర పేరే ‘బిగ్ బుల్’. ఆ పాత్ర లుక్ ను కొంతసేపటి క్రితం చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

సూటు .. చెవి రింగ్ .. పచ్చబొట్టుతో ఈ పోస్టర్ లో సంజయ్ దత్ చాలా స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఆయనను గన్స్ తో కొంతమంది టార్గెట్ చేసినట్టుగా అందుకు సంబంధించిన లేజర్ పాయింట్స్ ఆయన శరీరంపై కనిపిస్తున్నాయి. అయినా ఆయన చాలా కూల్ గా ఖరీదైన చుట్ట కాలుస్తూ కనిపిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 8వ తేదీన ‘మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement