Sunday, April 28, 2024

సంహారం మూవీ టీజర్‌

YouTube video

శ్రీరాముల నాగరత్నం సమర్పణలో, రత్న మేఘన క్రియేషన్స్‌లో ఆదిత్య శశాంక్‌, కవితమహతో హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సంహారం. సాకేత్‌ సాయిరాం, స్నేహ శర్మ, రాథోడ్‌, రామ్‌ కుర్ణవల్లి, రామకృష్ణ, కోటయ్య, ఇతర పాత్రధారులు. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘సంహారం’ చిత్రం టీ-జర్‌ను కాంగ్రెస్‌ పార్టీ నేత భట్టి విక్రమార్క విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” సమాజంలో మహిళల పాత్ర వారి స్థితిగతులు గురించి దర్శకుడు ధర్మ ఈ చిత్రంలో చక్కగా చిత్రీకరణ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి ధర్మ కు మంచి పేరు రావాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రానికి సంగీతం :సాకేత్‌ సాయిరాం, కెమెరా: శ్రీరాముల శ్రీనివాస్‌, ఎడిటర్‌- కృష్ణ పుత్ర జై, కోరియోగ్రాఫర్‌: వినమ్‌ ఇమ్మడి. సహ నిర్మాతలు : తాటికొండ నవీన్‌, గణష్‌ పెనుబోతు, రచన, దర్శకత్వం: శ్రీరాముల ధర్మ, నిర్మాత: ధర్మా చారి

Advertisement

తాజా వార్తలు

Advertisement