Sunday, May 19, 2024

Samantha: స‌మంత కిల్ల‌ర్ లుక్స్ ….

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్.. సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మయోసైటిస్ నుంచి మెల్లగా కోలుకుంటూ ఈ మధ్యే ఇండస్ట్రీలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి డబ్బింగ్ పూర్తి చేసింది. ఈ సిరీస్ 2024లోనే రిలీజ్ కానుంది.

తాజాగా ఫెమినా ఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చింది సమంత. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫెమినా మ్యాగజైన్.. సామ్ ఫొటోను పబ్లిష్ చేసింది. ఈ విషయాన్ని ఇన్ స్టాలో తెలిపింది. సమంత ఓ ప్రకృతి శక్తి.. ఏ మాయ చేశావేలో జెస్సీ పాత్ర నుంచి సిటాడెల్ సిరీస్ లో ఆమె రోల్ వరకు సమంత జర్నీ దేశంలోని మహిళలకు స్ఫూర్తినిస్తుందంటా ఫెమినా ఇండియా సుదీర్ఘమైన ట్వీట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement