Thursday, November 7, 2024

నాగ చైతన్య-చందు మొండేటి సినిమాలో సాయి పల్లవి

వెండితెరపై లేడీ ప‌వ‌ర్ స్టార్ సాయి ప‌ల్ల‌విని చూసి ఏడాది దాటింది. విరాట పర్వంలో ఆమె పాత్ర తరువాత మ‌రో సినిమా చేయ‌లేదు సాయి ప‌ల్ల‌వి. కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం, చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైత‌న్య హీరోగా చేస్తున్న అప్ క‌మింగ్ మూవీలో నాగ చైతన్యతో కలిసి ఆమె న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ.. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ తో తెర‌కెక్కుతొంది.

కాగా, ఈరోజు ఈ మూవీలో సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టిస్తున్న‌ట్టు అప్ డేట్ తో ప్రోమోను రిలీజ్ చేశారు మేక‌ర్స్. అయితే, రిలీజ్ చేసిన‌ ప్రోమో వీడియోలో సాయి ప‌ల్లవి ముఖాన్ని చూపించ‌లేదు మేక‌ర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్యతో సాయి ప‌ల్ల‌వి చేస్తొన్న‌ రెండో సినిమా ఇది.

ఈ మూవీలో నాగ చైతన్య మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. రొమాంటిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీకాకుళం, విశాఖపట్నం, ఆమదాలవలస, గుజరాత్‌లలో చిత్రీకరించనున్నట్టు సమాచారం. నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి చేయబడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement