Monday, September 25, 2023

TS: పాలమూరులో త్వరలో జాతీయ స్థాయి క్రీడలు… మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (ప్రభ న్యూస్): మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ ఆవరణలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలో త్వరలో జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయబోతున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డా వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -
   


మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో అంతర్జాతీయ స్థాయి వసతులతో నిర్మించిన ఇండోర్ స్టేడియం పనులను ఇవాళ మంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. వాలీబాల్ అకాడమీ కోసం క్రీడాకారులకు అవసరమైన హాస్టల్ సౌకర్యాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. 400 మీటర్ల 8 లైన్ల సింథటిక్ ట్రాక్ పనులను కూడా త్వరలో ప్రారంభమిస్తామన్నారు. క్రీడాకారుల స్వర్గధామంగా మహబూబ్ నగర్ ను తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, కమిషనర్ ప్రదీప్ కుమార్, జిల్లా క్రీడా శాఖ అధికారి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement