Sunday, April 28, 2024

Sai Manjrekar : బ్లూ వేల్ గా స‌యీ…

బులుగు జిలుగు థై స్లిట్ ఫ్రాక్‌లో గుబులు పుట్టిస్తోంది స‌యీ మంజ్రేక‌ర్. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. నేటిత‌రంలో స్పీడున్న భామ‌గా స‌యీ సోష‌ల్ మీడియా డిబేట్ల‌లోకి వ‌స్తోంది. మేజ‌ర్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన స‌యీకి అంత‌కుముందు స‌రైన స‌క్సెస్ లేదు.

ఇప్ప‌టివ‌ర‌కూ అడివి శేష్ మూవీ మేజ‌ర్ త‌న‌ కెరీర్ బెస్ట్ అన‌డంలో సందేహం లేదు అయితే ద‌బాంగ్ 3తో త‌న కెరీర్ ఎంత సులువుగా ప్రారంభ‌మైందో స‌యీ మంజ్రేక‌ర్ తాజా ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకుంది. త‌న తండ్రి మహేశ్ మంజ్రేకర్ కారణంగా ప‌రిశ్ర‌మ‌లో త‌న ఆరంగేట్రం చాలా సులభంగా జ‌రిగింద‌ని స‌యీ అన్నారు. అంతేకాదు త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు సల్మాన్ ఖాన్‌ను తన రక్షణ వలయం అని పిలవగలిగినందుకు కృతజ్ఞత నిండి ఉందని తెలిపింది.

- Advertisement -

22 ఏళ్ల స‌యీ బాలీవుడ్‌లో స‌ల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 (2019)తో అరంగేట్రం చేసింది. అప్పటి నుండి అతడిని తన గురువు మార్గదర్శిగా భావిస్తాన‌ని తెలిపింది. అలాగే త‌న తండ్రి మ‌హేష్‌ మంజ్రేకర్ తన వృత్తిపరమైన నిర్ణయాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోరని తెలిపింది. నాన్న ఒక దర్శకుడిగా నాకు ఉత్తమమైన సలహా ఇస్తాడు. కానీ నా సినిమా చూసిన తర్వాత చాలా నిర్మాణాత్మక విమర్శలు కూడా చేస్తార‌ని వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement