Monday, May 13, 2024

ఆర్ఆర్ఆర్ సెకండ్ సాంగ్ కూడా వచ్చేస్తోంది..

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిందే. ఈ దసరాకి మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది. దీంతో ప్రమోషన్ స్పీడ్ ని కూడా పెంచుతోంది యూనిట్. ఇప్పటికే సినిమాలోని మొదటి సాంగ్ “దోస్తీ”ని ఆగష్టు 1న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ పర్వాలేదనిపించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి “ఆర్ఆర్ఆర్” సెకండ్ సింగిల్ పై పడింది. ఉక్రెయిన్ లో ఈ సాంగ్ కోసం భారీ సెట్ ను నిర్మించారట. అందులోనే సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ సెట్ కు సంబంధించిన పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ పిక్ చూస్తుంటే బ్రిటిష్ కాలానికి చెందిన సెట్ లా ఉంది. ఆ పిక్ లో పైన గుర్రం, బాణం గుర్తులు ఉండడంతో సాంగ్ కేవలం రామ్ చరణ్ పైనే తీస్తున్నారా ? అనే డౌట్ వస్తోంది. దర్శకుడు రాజమౌళి విజన్ లో ఈ సాంగ్ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సెకండ్ సింగిల్ అయినా రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.

ఇక మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికి రాజమౌళి మార్క్ ఉత్కంఠను పెంచే ప్రమెషన్ ఇప్పటివరకు కనిపించలేదనే చెప్పాలి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై డివివి దానయ్య అత్యంత్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లూరి పాత్రలో రామ్ చరణ్, కోమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సముద్రకని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఉక్రెయిన్ లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై స్పెషల్ గా ఓ భారీ సాంగ్ ఉండబోతోంది అని ముందుగానే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ నే మేకర్స్ ఉక్రెయిన్ లో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ టూ దుబాయ్: 180 సీట్లున్న విమానంలో ముగ్గురే వెళ్లారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement