Thursday, May 2, 2024

మోస్ట్ యాంటిసిపేటెడ్ ‘రొమాంటిక్ మూవీ’

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ఎంతో మంది హీరోలకు స్టార్ డమ్ తీసుకువచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. అయితే పూరి జగన్నాథ్ ఫ్యామిలీ నుంచి ఆయన తమ్ముడు సాయిరాం శంకర్ మొదట హీరోగా పరిచయమయ్యారు. కానీ నిలబడలేకపోయారు. ఆ తర్వాత పూరి కొడుకు ఆకాష్ ఎంట్రీ ఇచ్చాడు. కానీ సరైన హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. కానీ ఆకాష్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ సినిమా పై మాత్రం అంచనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫోటోలు పోస్టర్ లకు యూత్ లో మంచి క్రేజ్ ని తీసుకు వచ్చాయి.

ఇదిలా ఉండగా తాజాగా పూరి కనెక్ట్స్ సంస్థ ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. సినిమాల విషయంలో చాలా మంది ఫాలో అయ్యే అంతర్జాతీయ వెబ్సైట్ ఐఎండిబి ఓ లిస్ట్ ప్రకటించింది. మోస్ట్ యాంటిసిపెటెడ్ ఇండియన్ మూవీస్ అండ్ షోస్ అంటూ లిస్ట్ ని బయటికి తీసుకు వచ్చింది. అందులో రెండో ప్లేస్ లో రొమాంటిక్ సినిమా ఉంది. టాప్ టెన్ లో సెకండ్ ర్యాంక్ సాధించిన ఈ మూవీ రాక కోసం యూత్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement