Wednesday, May 8, 2024

ప్రభాస్ సోదరిగా….జ్యోతిక ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతోపాటు సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర డాన్ క్యారెక్టర్ కాగా… మరో పాత్రలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రభాస్ కి సోదరిగా రమ్యకృష్ణ కనిపించబోతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే బాహుబలి లో ప్రభాస్ కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది.ఇప్పుడు సోదరి పాత్ర అంటే వర్కౌట్ అవుతుందో లేదో అని చిత్రబృందం ఆలోచన లో పడిందట. అందుకే ప్రభాస్ సోదరిగా గా జ్యోతిక ను సంప్రదించారట. ఆ పాత్రకు జ్యోతిక అయితే సరిగ్గా సరిపోతుందని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. ఇక జ్యోతిక కూడా ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పిందట. కాగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా… వచ్చే ఏడాది ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement