Saturday, May 4, 2024

రీతు వర్మ ఫుల్ జోష్ @ఐదు సినిమాలు

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన పెళ్లి చూపులు సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది రీతువర్మ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అలాగే నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డును సైతం అందుకున్నారు రీతు. అయితే ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం మాత్రం తమిళంలో సినిమాలు చేస్తూనే మరోవైపు తెలుగులో కూడా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది. అయితే ప్రస్తుతం రీతు వర్మ చేతిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి టక్ జగదీష్. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే నాగ శౌర్య తో చేస్తున్న వరుడు కావలెను షూటింగ్ దశలో ఉంది.

అలాగే శర్వానంద్ తో చేస్తున్న ఒకే ఒక జీవితం షూటింగ్ దశలోనే ఉంది. అలాగే చియాన్ విక్రమ్ తో ధ్రువ నక్షత్రం సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే తాజాగా కోలీవుడ్ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పింది రీతు. ఇందులో రీతూ తో పాటు అపర్ణ బాలమురళి కూడా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement