Monday, May 6, 2024

పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు… స్థానికులకే ఉద్యోగాలు

పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలని ఏపీ సీఎం జగన్ అన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి  జగన్‌ అధ్యక్షతన ‘స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు’ సమావేశం జరిగింది. పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఏర్పాటు కానున్న కంపెనీల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఏర్పాటవుతున్న పరిశ్రమల వల్ల పర్యావరణ ప్రభావాన్ని కూడా పరిగణనలోనికి తీసుకోవాలని సీఎం సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలన్నారు.

సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం

కడప సమీపంలో కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపోనెంట్స్‌ లిమిటెడ్‌కు అంగీకారం తెలిపారు. ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు ఇక్కడ తయారీ. ఈ పరిశ్రమవల్ల ప్రత్యక్షంగా 2వేల మంది ఉద్యోగాలు లభిస్తాయి. మొత్తంగా రూ.401 కోట్ల పెట్టుబడి కంపెనీ పెట్టనుంది.

 కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్‌కమల్‌ లిమిటెడ్‌కూ బోర్డు అంగీకారం తెలిపింది. నీల్‌కమల్‌కు దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు ఉన్నాయి. అన్నికంటే ఇక్కడ పెద్ద పరిశ్రమలను నీల్‌కమల్‌ ఏర్పాటు చేయనుంది.  రూ. 486 కోట్ల పెట్టుబడిని నీల్‌కమల్‌ పెట్టనుంది. ప్రత్యక్షంగా 2030 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఫర్నీచర్‌, ఇతర గృహోపకరణాల తయారీ కానున్నాయి. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్‌ తదితర కంపెనీలకు స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ అందిస్తుంది. జపాన్, కొరియాలకు చెందిన అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ. జర్మనీ నుంచి ఐఎల్‌టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రీన్‌ టెక్‌ వినియోగించనుంది. ప్రస్తుతం 2700 మందికి ఉద్యోగాలు, విస్తరణ ద్వారా అదనంగా 2200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయి.

చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌ టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు బోర్డు అంగీకారం తెలిపింది. సుమారు 30 కోట్ల పెట్టుబడి, 2304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఇందులో 90 శాతం మహిళలకే ఉద్యోగాలు ఇవ్వనున్నారు. పురుషులు, పిల్లల బట్టలుతయారీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి, తమ్మినపట్నం గ్రామాల వద్ద జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు ఇచ్చేందకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. 2.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిందాల్‌ ఆంధ్రా లిమిటెడ్‌ ఏర్పాట్లు చేసింది. తద్వారా  2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.

- Advertisement -

విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమకు ఏర్పాటుకు డెడ్‌లైన్‌ను పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపారు. కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువును పెంచాలని సెయిట్‌ గోబియాన్‌ కోరింది. దీంతో జూన్‌ 2022 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్స్, గార్మెంట్స్‌ మార్కెట్‌ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్‌ పార్క్‌ నిర్మాణానికి ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల స్థలంలో రిటైల్‌ బిజినెస్‌ పార్క్‌రూ. 194.16 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్‌ యూనిట్స్‌ సుమారు 5వేల మందికిపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి. మరో 20వేల మందికి పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు హబ్‌గా ఈ పార్క్‌ ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని అంచనా. పార్క్‌లో భాగంగా ఏర్పాటవుతున్న స్టోర్స్‌ నుంచి ఒక్కో స్టోర్‌లో ఏడాదికి సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఎస్‌ఐపీబీలో రిటైల్‌ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం తెలిపారు.

ఇదీ చదవండి: తెలంగాణ జెన్ కో, ట్రాన్స్ కోకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement