Sunday, April 28, 2024

రీల్స్ పుష్ప అహ్ అహ్ స్టెప్

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. భారీ బడ్జెట్ తో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అలాగే రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి దాక్కో దాక్కో మేక అంటూ సాగే సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాటలో అహ్ అహ్ అహ్ స్టెప్ ను ఇప్పుడు ఇన్ స్తా రీల్స్ లో పుష్ప టీమ్ పెట్టడం జరిగింది. ఈ పాట కి ఇమిటేశన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉండటం తో చిత్ర యూనిట్ ఇలా రీల్స్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement