Sunday, April 28, 2024

సత్య దేవ్ పై ప్రశంసలు కురిపించిన రానా

డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు సత్య దేవ్. ఇటీవల తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవటంతో పాటు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా సత్య దేవ్ చేసిన హాబీబ్ ఫుల్ సాంగ్ విడుదలైంది ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆయన నటన పై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపధ్యంలోనే దగ్గుబాటి రానా కూడా ఈ వీడియోపై స్పందించారు. చాలా అద్భుతంగా ఉంది. కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది… అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక రానా ట్వీట్ పై రిప్లై ఇచ్చారు సత్యదేవ్. కెప్టెన్ చాలా థ్యాంక్స్… మీ పోస్టు చూస్తున్నందుకు టీం చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు.సత్య దేవ్ చేసిన ఈ సాంగ్ కు జెన్నిఫర్ ఆల్ఫాన్స్ దర్శకత్వం వహించగా… జయ ఫణి కృష్ణ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement