Friday, May 24, 2024

ర‌వితేజ ‘రావ‌ణాసుర‌’.. డిఫరెంట్​ కేరెక్టర్​గా తెరకెక్కుతున్న మూవీ!

మాస్ మ‌హారాజా రవితేజ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సినిమా రావణాసుర. అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించే ఈ సినిమాకి రవితేజ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. అయితే.. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నట్టుగా సినీ వ‌ర్గాల‌నుంచి సమాచారం.

ఇక‌.. ‘రావణాసుర’ టైటిల్ ను సెట్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ సినిమాలో రవితేజ పాత్ర, ఇంతవరకూ ఆయన చేసిన కేరెక్ట‌ర్ల‌కు డిఫ‌రెంట్‌గా ఉంటుందని అంటున్నారు. సుశాంత్ కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ – బీమ్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement