Monday, May 6, 2024

ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసిన రష్మిక మందన్న..

తన నటనతో ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇప్పుడు ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేయబోతుంది. ఇప్పటివరకు ఆమె, సినిమాలో రెగ్యులర్ పాత్రలు పోషించింది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలో ఆమె నటించనుంది. “ఖైదీ”, “ఒకే ఒక జీవితం” వంటి అద్బుతమైన సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తన 30వ ప్రాజెక్ట్ రష్మికతో చేయనుంది.

స్టోరీ రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించనున్నడు. ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మాత బాద్యతలు చేపట్టారు. రేపు (సోమవారం) హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాను అధికారికంగా ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement