Friday, May 3, 2024

చరణ్-శంకర్ మూవీ ప్రారంభమయ్యేది అప్పుడే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో మూవీ ఆర్‌సి 15″ను మొదట్లో జూలై మొదటి వారం నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా మహమ్మారి కారణంగా చరణ్ నటిస్తున్న “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ షూటింగ్ తో పాటు “ఆర్‌సి 15” ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయాయి. ఇక తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ మొదటి వారం నుండి “ఆర్‌సి 15” సెట్స్ పైకి వెళ్లనుంది అంటున్నారు. రామ్ చరణ్ ఆగష్టు ఆరంభం నాటికి “ఆర్‌ఆర్‌ఆర్” షూటింగ్‌ను ముగించి, ఆపై స్క్రిప్ట్ రీడింగు, క్యారెక్టర్ వర్క్‌షాప్‌ కోసం నెల రోజులు విరామం తీసుకోనున్నాడు. మరోవైపు శంకర్ 6 నెలల వరకు నిరవధికంగా షూటింగ్ జరిపి, సినిమాను పూర్తి చేయాలనీ భావిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: మంట‌లు రేపుతోన్న కియారా బికినీ ఫోటో..

Advertisement

తాజా వార్తలు

Advertisement