Friday, April 26, 2024

రాధే శ్యామ్ రిలీజ్ ఇప్పుడు లేనట్టే!!

రాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధే శ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదల అయిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే మరో పది రోజుల రీషూట్ కు యూనిట్ ప్లాన్ చేయగా కరోనా మహమ్మారి కారణంగా అది వాయిదా పడింది. అయితే ఇటీవల కరోనా తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్స్ ఓపెన్ అయిన వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

అయితే త్వరలో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఆక్యుపెన్సీ తో స్టార్ట్ అవ్వడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. అందువల్ల ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మరికొంత సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాను యూవి క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement