Monday, May 6, 2024

అజిత్ సరసన నాని హీరోయిన్ ?

నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ ను సాధించింది. ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శ్రీకారం సినిమాలో నటించింది. కాగా తాజాగా తమిళ స్టార్ హీరో పక్కన ప్రియాంక చాన్స్ కొట్టినట్లు తెలుస్తోంది. వాలిమై తర్వాత అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది.

ఇందులో ఓ హీరోయిన్ గా ప్రియాంక ను అనుకుంటున్నారట. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఇక గతంలో శివకార్తికేయన్ తో డాక్టర్ సినిమా చేసింది ప్రియాంక. ఇప్పుడు శివ కార్తికేయన్ తోనే డాన్ అనే సినిమా చేస్తోంది. అలాగే సూర్యకు జంటగా కూడా ఓ సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement