Friday, April 26, 2024

వకీల్ సాబ్ చూసిన ఎన్టీఆర్ పవన్ ని హగ్ చేసుకున్నాడు – ప్రకాష్ రాజ్

లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో అంజలి, నివేద థామస్, అనన్య కీలక పాత్రలు పోషించారు. అయితే ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు.

ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వకీల్ సాబ్ సినిమా చూసిన చాలా మంది హీరోలు పవన్ ను అభినందించారని, అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ను హగ్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కాగా వకీల్ సాబ్ సినిమా చూసినట్లు తారక్ ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ప్రకాష్ రాజు మాత్రం ఆ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం విన్న ఎన్టీఆర్ పవన్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement