Wednesday, March 27, 2024

సాగ‌ర్ లో బిజెపికి డిపాజిట్ క‌ష్ట‌మే – మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి….‌

తలాపున సాగర్‌ ఉన్నా..తాగడానికి నీళ్లులేవు
కాల్వ చివరి భూములు బీడులే
ఏడేళ్లలో అన్నింటిని అధిగమించాం
రైతు ఆత్మహత్యలను నివారించగలిగాం
కేసీఆర్‌ పథకాలే ఆకలిని పారదోలాయి
నెల్లికల్‌ ప్రాజెక్టు 18నెలల్లోపూర్తిచేయకపోతే రాజీనామా చేస్తా
కేసీఆర్ ప్రచారానికొస్తే ప్రతిపక్షాలకు వణుకెందుకు
ఆంధ్రప్రభతో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి

ఉమ్మడి నల్గొండ, : నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మరోసారి గులాబీజెండా ఎగరబో తోంది. విపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా.. ప్రజలంతా కేసీఆర్‌ వెంటే ఉన్నారు. ప్రచారంలో అది స్పష్టంగా కని పిస్తోంది. అందుకే కేసీఆర్‌ వస్తున్నారంటే ప్రతిపక్షాలు గజగజ వణుకుతున్నాయి అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు. సాగర్‌ ఉప ఎన్నికల ప్రచా రం ముగింపుదశకు చేరుకోవడం, బుధవారం సీఎం సభ జరగనున్న నేపథ్యంలో.. మంత్రి జగదీష్‌రెడ్డి ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇంటర్వ్యూ వివరాలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డికి మళ్ళీ పరాభవం తప్పదని, జానారెడ్డి గతం.. టీఆర్‌ఎస్‌ భవిష్యత్తు అని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభ్యర్ధిగా నిలిపిన నోముల భగత్‌ మంచి మెజారిటీతో విజయం సాధిస్తారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్‌ కూడా రాదన్నారు. ఇక్కడ వారికి ఉన్నదీ లేదు.. కొత్తగా వచ్చేదీలేదు.. పోయిన ఎన్నికల్లో ఎట్లుందో.. ఇపుడూ పరిస్థితి అలాగే ఉందన్నారు. సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారా నికి సీఎం కేసీఆర్‌ వస్తే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతు న్నాయన్నారు. ఒక పార్టీ అధినేతగా ప్రచారానికి రావడం తప్పా అని ప్రశ్నించారు.
ఆకలిపై కేసీఆర్‌ విజయం
రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యమైన ఈప్రాంతంలో సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు అన్నింటిని పారదోలాయని మంత్రి జగదీష్‌రెడ్డి చెప్పారు. ఆకలిపై కేసీఆర్‌ సాధించిన విజయమన్నారు. పదవులకు లొంగిపోయి కాంగ్రెస్‌ నేతలు ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు ఎందుకు ఓట్లేయాలో చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు ఎందుకు వేయాలో.. వేయి అంశాలు చెబుతాం. మేనిఫెస్టో హామీలు అమలు చేశాం.. చెప్పని పథకాలు కూడా ప్రజల దగ్గరకు తెచ్చాం.. ఇంటింటికి మంచినీరు ఇచ్చాము.. 24గంటల కరెంట్‌ అందించాం..పెట్టబడి సాయం చేసి ఆదుకున్నాం.. అందుకే ఓట్లు- అడుగుతున్నాం అని మంత్రి జగదీష్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం 57సంవత్సరాల పింఛన్‌ ఇచ్చే కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు.
నెల్లికల్‌ పూర్తిచేసి తీరుతా
నెల్లికల్‌ ఎత్తిపోతల పథకం18నెలల్లో పూర్తి చేయకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జగదీష్‌ రెడ్డి చెప్పారు. పర్యావరణ అనుమతులు ఆలస్యం కావడంతో శంకుస్థాపన ఆలస్యమైందని, ఇప్పటి నుండి పనులు శరవేగంగా జరిపిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ 18నెలల్లో ఈ పథకాన్ని పూర్తి కాకపోతే మంత్రి పదవి నుండి తప్పుకుంటానన్నారు. సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వస్తే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతు న్నాయన్నారు. ఒక పార్టీ అధినేతగా ప్రచారానికి రావడం తప్పా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శించడానికి కాంగ్రెస్‌ నేతలకు అంశాలు దొరక్క వ్యక్తి గత విమర్శలకు దిగుతున్నారని అన్నారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా సాగర్‌లో ఎగిరేది గులాబీ జెండానేనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement