Saturday, March 23, 2024

24 గంట‌ల‌లో ప‌ట్టాదారు పాస్ బుక్…‌

సర్కారు కార్యాచరణ
ముద్రణ, జాప్యంపై దృష్టి
నెలకు 60వేల పాస్‌బుకలే ముద్రణ
జోరందుకున్న క్రయవిక్రయాలు
ధరణితో తప్పిన ఇబ్బందులు
పెరిగిన పారదర్శకత
రిజిస్ట్రేషన్ వెంటనే మ్యూటేషన్

హైదరాబాద్‌, : రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ సరళతరం చేయడంతో భూములకు మహర్ధశ వచ్చింది. భారీగా ధరలు పెరగడంతోపాటు క్రయవిక్రయాలూ పెరిగాయి. ధరణి పోర్టల్‌తో ఏక కాలంలో అందిస్తున్న సేవలతో పారదర్శకత పెరిగింది. ఇది క్రయ విక్రయాదారులకు కలిసి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూముల కొనుగోలు, విక్రయం వ్యాపారంగా మారింది. దీంతో పాస్‌ పుస్తకాలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన 24 గంటల్లోగానే కొనుగోలుదారుడికి పాస్‌ పుస్తకం అందించేలా సర్కార్‌ కార్యాచరణ చేస్తోంది. ప్రస్తుతం వస్తున్న అనేక ఇబ్బందులను తొలగిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పాస్‌ పుస్తకాల ముద్రణ, జాప్యంపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో గతంలో పాస్‌ పుస్తకాల ముద్రణకు 8 సంస్థలకు ఇచ్చిన టెండర్లను పరిశీలించిన సర్కార్‌ జాప్యం చేస్తున్న సంస్థల టెండర్లను పున: సమీక్షించనుంది. మరికొన్ని కొత్త ముద్రణా సంస్థలనుంచి టెండర్లను ఆహ్వానించి ఇకమీదట నెలకు 60వేలకుపైగా పుస్తకాలను ముద్రించేలా వ్యూహం ఖరారు చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్లాట్లతోపాటు వ్యవసాయ భూములకూ డిమాండ్‌ పెరిగింది. రైతుబంధు, రైతు బీమాతోపాటు పెట్టిన పెట్టుబడికి మంచి ఫలితాలు రావడం కూడా డిమాండ్‌ పెరుగుదలకు కారణమవుతోంది. యాదాద్రి,సూర్యాపేట, రంగారెడ్డి, మెదక్‌, మేడ్చేల్‌-మల్కాజ్‌గిరీ, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌, జనగాం ఇలా ఎక్కడ చూసినా భారీగా క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి.
ధరణి పోర్టల్‌ రాకతో వ్యవసాయ భూములను వ్యవసాయేతర రంగానికి (నాలా) కన్వర్షన్‌ సులువుగా, వేగంగా అందుబాటులోకి వచ్చి ంది. గతంలో నాలా కన్వర్షన్‌కు ఎన్‌సీ పొందాల్సిన ఇబ్బందులు ఇప్పు డు తప్పాయి. ఆర్డీవోకు దరఖాస్తు చేస్తే తహశీల్దార్‌, ఆర్‌ఐ, వీఆర్వో విచారించి నివేదిక సమర్పిస్తే అనుమతులు వచ్చేందుకు నెల రోజులుపైగా పట్టేది. కానీ ఇప్పుడు ధరణిలో భూమి ఉంటే నాలాకు స్లాట్‌ నమోదు చేసుకోగానే తదుపరి రోజే అనుమతి వస్తోంది. రాష్ట్రం లో భూముల ధరలకు గతంలో ఉన్నట్లుగా గ్రామం యూనిట్‌గా కాకుండా సర్వే నెంబర్ల వారీగా నిర్ధారిస్తున్నారు. ఇది రైతాంగానికి, పెట్టు బడిదారులకు కలిసి వస్తోంది. ధరణి పోర్టల్‌లో సర్వే నెంబర్‌ ఎంటర్‌ చేయగానే మార్కెట్‌ ధర నిర్ధారిస్తోంది. దీంతో పారదర్శకత పెరిగింది.
భూభాగం వివరాలు…
2.80 కోట్ల ఎకరాల భూభాగం
1.42కోట్ల ఎకరాల వివాదరహిత వ్యవసాయ భూమి
17.89లక్షల ఎకరాల భూమి వివిధ న్యాnయపరమైన, చిక్కుల్లోని భూమి
11.95లక్షల ఎకరాల రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూమి
84.00లక్షల ఎకరాల చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వేలైన్‌, సబ్‌స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింది భూములు, కోర్టు కేసుల్లోని అటవీ భూములు
24 లక్షల ఎకరాల నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని నివాస ప్రాంతాలు, వివాదాలు లేని అటవీ భూములు
ప్రతీ ఎకరం భూభాగం వివరాలను ధరణి పోర్టల్లో పొందుప రుస్తూ ఎప్పటికప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ ధరణి పేరుతో కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో రికార్డులు నిర్వ హణ జరుగుతున్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ వివరాలు, పేరు మార్పిడి వివరాలు అదే రోజు ఈ ధరణిలో నమోదు అవుతున్నాయి, మండల కార్యాలయంనుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్లా ఈ వెబ్‌సైట్‌ నుంచే వివరాలు లభ్యమవుతున్నాయి. విదేశాల్లో ఉన్నవా ళ్లుకూడా ధరణి ద్వారా అందే సమాచారంతో క్రయ, విక్రయాలు జరుపు కుంటున్నారు. ప్రతీయేటా రాష్ట్రం10నుంచి 12లక్షల ఎకరాల సాగుభూ ములు క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మ్యుటేషన్‌కు గతంలో ఉన్న 15 రోజుల గడువును రెండు రోజులకు తగ్గించడంతోపాటు పాస్‌ పుస్త కాల జారీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినట్లయింది. రిజి స్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక మ్యుటేషన్‌ తతంగాన్ని గంటలో పూర్తి చేసేలా చట్ట సవరణ చేసిన సంగతి తెలిసిందే. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో సం స్కర ణలతోపాటు ఆర్వోఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 60లోమార్పులు పూర్తయ్యాయి.

పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల ముద్రణకు టెండర్లు
కొత్తగా పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల ముద్రణకు సరఫరా దారులనుంచి టెండర్లు కోరుతూ సర్కార్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 17రకాల సెక్యూరిటీ ఫీచర్లతో నెలకు 60వేలకుపైఆ పాస్‌ పుస్తకాలను ముద్రించాలని ఈ టెండర్‌లో పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ టెక్నాలజీ సర్వీస్‌ లిమిటెడ్‌టీఎస్టీఎస్‌) ఈనెల 12న టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రతీ నూతన రిజిస్ట్రేషన్‌కు కొత్త పాస్‌ పుస్తకాల దిశగా ఈనిర్ణయం తీసుకుంది. ఈ బిడ్‌లో టెండర్లు దాఖలు చేసే సంస్థలు రూ. 10వేల దరావత్తును డాక్యుమెంట్‌ ఫీజుగా, ఈఎండిఆ రూ.25లక్షల డీడీని టీఎస్టీఎస్‌ ఎండీ పేరుతో సమర్పించాల్సి ఉంటుంది.
టెండర్‌ షెడ్యూల్‌….
ఈ మెయిల్‌లో బిడ్ల స్వీకరణ ఈనెల 17 మ.3 వరకు
క్లారిఫికేషన్లు 19 వరకు
టెండర్లకు చివరి తేదీ 27 మధ్యాహ్నం 3 గంటల వరకు
టెండర్ల ఓపెనింగ్‌ ఈనెల 27న
టెండర్లను ఇ ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో అధికారిక పోర్టల్‌లో నమోదు చేయాలని టెండర్‌ మార్గదర్శకాలను జారీ చేసింది.‌

Advertisement

తాజా వార్తలు

Advertisement