Friday, May 17, 2024

Prabhas Kalki Trailer | కల్కి లేటెస్ట్ అప్‌డేట్ చెప్పేసిన డైరెక్టర్ !

పాన్‌ఇండియన్ స్టార్‌ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టాడు. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. అదే విధంగా.. దర్శకుడు మారుతి కూడా సంక్రాంతి ప్రభాస్ సినిమాపై ఓ అప్‌డేట్ ఇవ్వబోతున్నాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898ఏడి’ తెరకెక్కుతోంది. హిందూ మైథలాజి కాన్‌సెప్ట్‌తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌‌గా ఈ సినిమాని రూపొందుతొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.

కాగా, తాజాగా బాంబే ఐఐటిలో జరుగుతున్న కాలేజీ ఫెస్ట్‌ లో దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. ఈ టెక్‌ఫెస్ట్‌లో కల్కి సినిమా ట్రైలర్ అప్డేట్ చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. అక్కడ టెక్నికల్ స్టూడెంట్స్ తో అయన ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఈ క్రమంలో ఓ స్టూడెంట్ ‘కల్కి 2898AD’ సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడగ్గా నాగ్ అశ్విన్ దీనికి.. 93 రోజుల తర్వాత రిలీజ్ అవ్వొచ్చేమో అని సమాధానమిచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ లెక్కలేసుకుంటున్నారు. నాగ్ అశ్విన్ చెప్పిన దాని ప్రకారం లెక్కేసుకుంటే 93 రోజుల తర్వాత ఏప్రిల్ 1 వస్తుంది. మరి ఆ రోజే రిలీజ్ చేస్తారా.? లేక ఏప్రిల్ 1 అని ఏప్రిల్ ఫూల్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు అభిమానులు.

ఇక ఈ సినిమాలో కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఈ సంక్రాంతికే సినిమా రిలీజ్ ప్రకటించినా షూటింగ్ అవ్వకపోవడంతో సినిమా వాయిదా పడింది. దీంతో కల్కి సినిమా 2024 సమ్మర్ లోనే రిలీజ్ అవుతుందని టాక్ నడుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement