Thursday, May 2, 2024

MLA Dhanpal – సేవకు మారు పేరు… ఇందూరు యువత

నిజామాబాద్ సిటీ, డిసెంబర్ (ప్రభ న్యూస్)29: ప్రజలకు ఆపదలో గుర్తుకు వచ్చేది ఇందూరు స్వచ్చంద సంస్థ అని.. సేవకు మారు పేరు. ఇందూరు యువత అని అర్బన్ శాసనస భ్యులు ధన్ పాల్ సూర్యనా రాయణ కొనియాడారు ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలబ డ్డారన్నారు. శుక్రవారం నిజా మాబాదు నగరం లోని రాజీవ్ గాంధీ అడిటోరియం లో నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సంస్థ 12 వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా పార్లమెంట్ సభ్యుడు అర్వింద్ ధర్మపురి నిజ‌మాబాద్ శాసనసభ్యుడితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దన్పాల్ మాట్లాడుతూ, గతం లో కూడా తాము ఇందూరు యువత కు అండగా ఉన్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇదే విదంగా మా మద్దతు ఉంటుందన్నారు. మీరు నెల్కొలపే మనశాంతి కోవెల కు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారం ఉన్న మేము కృషి చేస్తామని తెలియచేశారు. ఈ సందర్బం గా ఇందూరు యువత స్వచ్చం ద సభ్యులకు.. ముఖ్యంగా సాయి కి మా అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఆసుపత్రి సూపరి డెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ ఇందూరు యువత అధ్యక్షులు దారం గంగాధర్, సాయి బాబా,సుశీల, స్రవంతి రెడ్డి,సుభాష్, సాయితేజ, సంస్థ సభ్యులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement