Wednesday, May 15, 2024

Pooja Hegde: వంగ‌పండు డ్ర‌స్ లో జాంపండు…

సోష‌ల్ మీడియాల్లో స్పీడ్ గా ఉండే భామ‌ల్లో పూజా హెగ్డే పేరు టాప్ స్టాల్ లో చేరింది. జాన్వీ, సారా, అన‌న్య లాంటి స్టార్ల‌తో పోటీప‌డుతూ పూజా వ‌రుస ఫోటోషూట్ల‌తో విరుచుకుప‌డుతోంది. ఆరంభం సోష‌ల్ మీడియాల్లో స్లోగా ఉన్న పూజా ఇటీవ‌ల స్పీడ్ మ‌రింత‌గా పెంచింది. పూజాను ల‌క్ష‌లాదిగా అభిమానులు ఇన్ స్టా వేదిక‌గా ఫాలో అవుతున్నది.

- Advertisement -

ఇటీవ‌ల‌ ఫోటోషూట్ల ప‌రంగా పూజా హెగ్డే ప్ర‌యోగాత్మ‌కంగాను క‌నిపిస్తోంది. ఇప్పుడు ప‌ర్పుల్ క‌ల‌ర్ ఫ్రాక్ లో క‌నిపించిన పూజా కొత్త‌ లుక్ ని అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. పొడుగు కాళ్ల సుంద‌రి అందం అంతా త‌న ఎంపికల్లోనే ఉంది అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. పూజా తాజాగా ప‌ర్పుల్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్ లో క‌నిపించింది. బ్యాక్ స్టేజ్ టు సెంట‌ర్ స్టేజ్! అంటూ ఈ ఫోటోల‌ను షేర్ చేసింది పూజా. ఈ కొత్త లుక్ లో ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. వంగ‌పువ్వు రంగు డిజైన‌ర్ ఫ్రాక్ లో పూజా అందం మ‌తులు చెడ‌గొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement