Tuesday, May 7, 2024

మా ఊరి పొలిమేర 2 పోస్ట‌ర్ విడుద‌ల

శ్రీకృష్ణ క్రియేషన్స్‌ బేనర్‌ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా.అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘మా ఊరి పొలిమేర-2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సత్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇటీ-వలే షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేతుల మీదుగా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ”మా ఊరి పొలిమేర -2 పోస్టర్‌ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు” అన్నారు.

నటు-డు సత్యం రాజేశ్‌ మాట్లాడుతూ ”గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘మా ఊరి పొలిమేర -2’ త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అన్నారు.
నిర్మాత గౌరికృష్ణ మాట్లాడుతూ ‘మా ఊరి పొలిమేర’ చిత్రాన్ని చూసి చాలా ఎ్జగట్‌ అయ్యాను. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘మా ఊరి పొలిమేర -2’ చిత్రం మా బ్యానర్‌లో చేస్తున్నందుకు దర్శకుడు డా. అనిల్‌ విశ్వనాథ్‌ గారికి, మరియు నటీ- నటు-లు అందరికీ ధన్యవాదాలు. అన్నారు.
దర్శకుడు డా. అనిల్‌ విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం విడుదల తేదీలను త్వరలోనే నిర్మాత గౌరికృష్ణ వెల్లడిస్తారు అని అన్నారు. డీఓపీ ఖుషేందర్‌ రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ. మా ఊరి పొలిమెర -2 చిత్రానికి డీఓపీ కావడం చాలా సంతోషంగా ఉంది. స్టోరి నాకు చాలా బాగా నచ్చింది. అని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: గ్యాని; సినిమాటోగ్రఫీ: ఖుషేందర్‌ రమేష్‌ రెడ్డి; ఎడిటింగ్‌: శ్రీ వర; కో-డైరక్టర్‌: ఆకుల నాగ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement