Saturday, May 18, 2024

IPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్..

ఐపిఎల్ 2023 16వ సీజ‌న్ లో భాగంగా ఇవ్వాల రాత్రి పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ 53వ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, మ‌రి కొద్ది సేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.


ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన మ్యాచ్ ల‌లో పంజాబ్ జ‌ట్టు 10 మ్యాచ్ లు, కోల్‌కతా జట్టు 10 మ్యాచ్ లు ఆడ‌గా.. 5 మ్యాచ్ లు గెలిచి 5 ఓడిపోయిన పంజాబ్ జ‌ట్టు టేబుల్ లో 7వ స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా జట్టు 6 మ్యాచ్ లు ఓడి పాయింట్స్ టేబుల్ లో 8 స్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement