Monday, April 29, 2024

నాగ్ సినిమాలో ఐటమ్ సాంగ్ పై పాయల్ క్లారిటీ

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయన. ఈ చిత్రం నాగార్జున కెరీర్ లోనే ఓ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు చిత్రాన్ని ఎప్పటినుంచో ప్రారంభించాలని దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమాని తెరకెక్కించేందుకు నాగార్జున కూడా రెడీ అవడంతో తో లాక్ డౌన్ అవ్వగానే ఈ సినిమాను ప్రారంభించాలని చూస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ ను సంప్రదించినట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై పాయల్ స్పందించింది. తను ఎలాంటి ఐటెంసాంగ్ చేయట్లేదని సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. అయితే గతంలో చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ పాయల్ నటించింది. కానీ ఈ సినిమాలో మాత్రం ఎలాంటి ఐటమ్ సాంగ్ చెయ్యట్లేదని క్లారిటీ ఇచ్చింది పాయల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement