Thursday, April 18, 2024

130 కుటుంబాలకు అలీ సహాయం..!!

కరోనా కష్ట కాలంలో ఎంతోమంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒక్క రోజు పనికి వెళ్లకపోతే పూటగడవని వాళ్లు కూడా ఉన్నారు. అటువంటి వారికోసం సోనూసూద్ లాంటి స్టార్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా సోనూసూద్ బాటలో ప్రముఖ నటుడు అలీ కూడా వచ్చారు. అయితే సినీ ఇండస్ట్రీలో షూటింగ్ లు లేక ఎంతో మంది ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అటువంటి వారికోసం సహాయం చేయడానికి అలీ ముందుకు వచ్చారు.

తెలుగు సినిమా ఉమెన్ ప్రొడక్షన్ యూనియన్ కు సంబంధించిన 130 కుటుంబాలకు తన భార్య జుబేదా చేతుల మీదగా నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. నా కళ్ళ ముందే లొకేషన్స్ లో ఉండే లేడీస్ సెట్ లో అందరూ తినే ప్లేట్స్ శుభ్రం చేస్తుంటారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ వల్ల వారంతా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే తనవంతు సహాయంగా రెండు లక్షల రూపాయలతో సాయం చేయాలని నిర్ణయించుకున్నానని అని చెప్పుకొచ్చారు అలీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement