Saturday, April 27, 2024

పవన్ కొత్త సినిమా మ్యూజిక్ పై మరో అప్డేట్ !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే ఇవ్వడం విశేషం.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మూడు పాటలు సెట్ చేస్తున్నాడట. అవి కూడా పవన్ పాడే పాట కాకుండా అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ఇక భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి చిరంజీవి శుభాకాంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement