Sunday, May 5, 2024

వివాదంలో పఠాన్ మూవీ.. ఆ సీన్స్ తొలగించకపోతే బ్యాన్ చేస్తాం.. మంత్రి నరోత్తం మిశ్రా

పఠాన్ మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్..దీపికా పదుకొణే నటించారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న పఠాన్ మూవీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ మూవీ నుంచి రిలీజైన బేష‌రమ్ రంగ్ సాంగ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పాట‌లో దీపికా ధ‌రించిన కాస్ట్యూమ్స్‌పై అభ్యంత‌రంతో పాటు అశ్లీలం మోతాదు మించింద‌ని ప‌ఠాన్ మూవీని బ్యాన్ చేయాల‌నే డిమాండ్‌ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ సినిమాపై నిషేధం విధించాల‌ని తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి న‌రోత్తం మిశ్రా కోరారు. ఈ మూవీలో కాషాయ దుస్తుల‌ను వాడటం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సినిమాలో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సీన్లు ఉన్నాయ‌ని, ఈ సీన్ల‌ను మార్చ‌నిప‌క్షంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పఠాన్ మూవీని బ్యాన్ చేస్తామ‌ని హెచ్చ‌రించారు. సినిమాలో అభ్యంత‌ర‌కరంగా ఉన్న కాస్ట్యూమ్స్‌ను, వివాదాస్ప‌ద సీన్ల‌ను మార్చ‌ని ప‌క్షంలో రాష్ట్రంలో ప‌ఠాన్ స్క్రీనింగ్‌ను అడ్డుకుంటామ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. బేష‌ర‌మ్ పాట‌లో కాస్ట్యూమ్స్ తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని, ఈ సాంగ్‌ను చ‌వ‌క‌బారు మైండ్‌సెట్‌తో చిత్రీక‌రించార‌ని మిశ్రా ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement