Monday, December 9, 2024

Pan Indian Movie | అడివి శేష్, శ్రుతి హాసన్ కాంబోలో..

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్ అడివి శేష్ ప్రస్తుతం G2 (గూఢచారి 2) ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ నిన్ననే స్టార్ట్ అయ్యింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గూఢచారి మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇవ్వాల‌ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లు ఇద్దరూ కూడా ఒక భారీ పాన్ ఇండియా మూవీ కోసం కలిసి వర్క్ చేయనున్నారు. శనేయిల్ డియో ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మేజర్ చిత్రం తర్వాత హీరో అడివి శేష్ మరోసారి హిందీ ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement