Friday, May 3, 2024

ఓటీటీలో రుద్రుడు..ఎప్పుడంటే

హార్రర్‌ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు లారెన్స్‌ను యాక్షన్‌ సినిమాలో చూడలేకపోయారు. రెండు వారాల క్రితం తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై న రుద్రుడు నిర్మాతలకు బోలెడు నష్టాలను మిగిల్చింది. తెలుగులో ఈ సినిమాను సీనియర్‌ ప్రొడ్యూసర్‌ ఠాగూర్‌ మధు రిలీజ్‌ చేశాడు. కథలో కొత్తదనం లేకపోవడం, దర్శకుడు కథిరేషన్‌ కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దక పోవడంతో వారం తిరిగేలోపే థియేటర్‌లలో నుంచి వెళ్లిపోయింది.దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమా మే రెండో వారం గానీ లేదంటే మూడో వారంలో గానీ స్ట్రీమింగ్ అవుతుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా డిజిటల్‌ హక్కులను సన్‌ నెక్స్ట్‌ సంస్థ దక్కించుకుంది. ఇక వచ్చే వారంలో ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement