Friday, April 26, 2024

OTT | తెలుగులో “ఓపెన్హైమర్”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఓపెన్హైమర్. ఈ సినిమాలో కిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్,ఫ్లోరెన్స్ పగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవలే ఓపెన్హైమర్ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అయితే ఇప్పటికే ఇంగ్లీష్ తో పాటు హిందీ, కన్నడ, మలయాళీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ మూవీ తాజాగా తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్దమయింది. జియో సినిమాలో ఓపెన్హైమర్ తెలుగు వర్షన్ ను స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఇదిలా ఉంటే… ఇందులో ఓపెన్‌హైమర్‌గా సిలియన్ మర్ఫీ నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఏకంగా ఆస్కార్ పురస్కారం కూడా అందుకున్నాడు. ఇక 96వ అకాడమీ అవార్డులు ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు,ఉత్తమ నేపథ్య సంగీతం, విభాగాలతో సహా మొత్తం 7 ఆస్కార్ అవార్డులు ఓపెన్ హైమర్ చిత్రం సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement