Saturday, April 27, 2024

త్రివిక్రమ్ మహేష్ సినిమా స్టార్ట్ అయ్యేది ఆ రోజేనట ?

సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా తో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమాని అయితే అనౌన్స్ చేసారు కానీ…ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పటివరకు ఇవ్వలేదు.

కాగా మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్ వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఆ రోజే ప్రారంభిస్తారని సమాచారం. అలాగే టైటిల్ ని లేదా నటీనటుల వివరాలు రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement