Sunday, April 28, 2024

బాలయ్య చెప్పిన సర్ ప్రైజ్ ఇదే !!

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న చిన్న సర్ ప్రైజ్ ఉంటుందంటూ ఎన్.బి.కె నిర్మాణ సంస్థ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఈ సర్ ప్రైజ్ ని అనౌన్స్ చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే ఆ సర్ ప్రైజ్ అనౌన్స్ చేశారు.

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శ్రీ రామ దండకాన్ని చదవబోతునట్లు చెప్పారు బాలకృష్ణ. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ పేజీలో రేపు 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement