Thursday, May 9, 2024

భ‌రీ యాక్ష‌న్ సీక్వెన్స్‌తో రేపు #NTR30 షూటింగ్ స్టార్ట్

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ష‌న్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న లెటెస్ట్ పాన్ ఇండియా మూవీ #NTR30. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండో మూవీ కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. అంతే కాకుండ‌.. ఈ మూవీలో స్టంట్స్ & విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ నుండి కొంతమంది ప్రముఖ సాంకేతిక నిపుణులను టీమ్ తీసుకుంది.

ఇక‌ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమా ఫైట్ సీక్వెన్స్‌తో రేపు షూటింగ్ ప్రారంభం కానుందట‌. తారక్ తో చేస్తున్ని ఈ ప్రాజెక్ట్ (#NTR30) ఇప్పటి వరకు తన బెస్ట్ వర్క్ అని కొరటాల శివ పూజా కార్యక్రమంలో అభిమానులకు హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ & యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement