Saturday, March 16, 2024

మే నెలలో ఏఈఈ పరీక్షలు.. షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ

ఏఈఈ పోస్టులకు ఈ ఏడాది జనవరి 22న ఓఎంఆర్‌ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 81,548 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 61,000 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం లీకేజీ నేపథ్యంలో కమిషన్ పరీక్షను రద్దు చేసింది.

కాగా, ఈ పరీక్షల పునః నిర్వహణ తేదీలను ప్రకటించారు అధికారులు. రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల షెడ్యూల్‌ను TSPSC ప్రకటించింది. మే 8, 9, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ & మెకానికల్ ఇంజినీరింగ్ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ (CBRT) విధానంలో, సివిల్ ఇంజనీరింగ్ పరీక్ష OMR విధానంలో నిర్వహించబడతాయి. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు అడ్మిట్ కార్డులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

AEE పరీక్ష షెడ్యూల్

- Advertisement -

మే 8 ఉదయం – మధ్యాహ్నం : ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్

మే 9 ఉదయం – మధ్యాహ్నం : వ్యవసాయ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్

మే 21 ఉదయం – మధ్యాహ్నం : సివిల్ ఇంజనీరింగ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement