Wednesday, May 15, 2024

హిట్ కొడితే ఒకే… లేకపోతే అంతే సంగతి !!

గతేడాది భీష్మ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు యంగ్ హీరో నితిన్. కాగా ఇటీవల రిలీజ్ అయిన చెక్ సినిమాతో మాత్రం డీలా పడ్డాడు. ప్రస్తుతం రంగ్ దే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన మహానటి కీర్తి ఫేమ్ సురేష్ నటిస్తోంది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు సినిమా పై అంచనాలు పెంచాయి.

మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందట. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 36 కోట్ల వరకు బిజినెస్ చేయగా విదేశీ హక్కులు కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో నితిన్ హిట్ కొట్టలేపోతే మాత్రం నితిన్ కెరీర్ లో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement