Monday, April 29, 2024

మీరు ఓకే అంటే రెండో పెళ్లికి రెడీ..!: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు రెండో పెళ్లికి సిద్దమయ్యారట…ఎంటీ నిజమే అనుకుంటున్నారా…అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ ముచ్చిటించిన ఆయన వారి కోరిక మేరకు సరదాగా సమాధానమిచ్చారు. నాగబాబు అప్పుడప్పుడు అభిమానులతో ఇన్‌స్టా వేదికగా చర్చిస్తుంటారు. తాజాగా నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు. నెటిజన్లు అడిగిన ఎన్నో రకాల ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. అందులో ముఖ్యంగా ఓ నెటిజన్ అడిగిన పశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగబాబుని సర్‌..మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని అడిగాడు ఓ నెటిజన్. దానికి నాగబాబు ‌సమాధానం చెబుతూ..  ఈ వయసులో నాకు పెళ్లా.. మీరంతా ఓకే అంటే నాకు కూడా ఓకే అంటూ రిప్లై ఇచ్చారు. నాగ‌బాబును అభిమానులు అనేక ర‌కాల ప్ర‌శ్న‌లు అడ‌గ్గా అందుకు ఆయన ఓపిగ్గా స‌మాధానాలు ఇచ్చారు.

ఓ నెటిజన్ అయితే ఏకంగా వకీల్ సాబ్ మూవీలో పవన్ కల్యాణ్ చెప్పిన ఆర్ యూ ఏ వర్జిన్ అనే డైలాగుతో నాగబాబును ప్రశ్నించాడు. ఈ ఊహించని ప్రశ్నకు షాకైన ఆయన.. అరే ఏంట్రా ఇది అనే మీమ్‌ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైలర్ అయింది. ఇక మరో ఓ ఔత్సాహికుడు మీరు పెళ్లి చేసుకున్నారా అని ప్రశ్నించగా.. లేదు. వచ్చే సంవత్సరం చేసుకోవాలనుకుంటున్నా.. మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి అని షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఏదో సరదాకి అభిమానులతో ముచ్చిటిస్తామనుకుంటే నాగబాబుకి ఊహించని రీతిలో ప్రశ్నలు ఎదురయ్యాయని నెటిజన్లు సెటైర్లు వేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement