Friday, March 29, 2024

వకీల్ సాబ్ ని చైతూ కంట్రోల్ చేస్తాడా ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సరిగ్గా వారం ముందు రిలీజ్ అవుతుంది. అంటే ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ దృష్ట్యా సినిమా ఎలా ఉన్నా సరే మొదటివారం అదిరిపోయే కలెక్షన్లు వస్తాయని రెండో వారం కూడా అదే జోష్ కొనసాగే అవకాశం ఉందని నిర్మాతలు గట్టి అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది నిర్మాతలు ఏప్రిల్ 9న రిలీజ్ కాబోయే సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు .

అయితే నాగచైతన్య మాత్రం వకీల్ సాబ్ తో పోటీకి సిద్ధం అంటున్నాడు.మరి ఎంతవారు నాగ చైతన్య వకీల్ సాబ్ వేగాన్ని ఆపగలడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement