Sunday, April 28, 2024

సలార్ లో శివగామి ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించబోతున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా… ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమా రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట. ప్రభాస్ కి అక్క పాత్రలో రమ్యకృష్ణ నటించబోతోందని ఈ ఇద్దరి మధ్య ఎమోషనల్ సీన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే రమ్య కృష్ణ పాత్ర పై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సిందే. ఇక ప్రభాస్ ఆదిపురుష్ తో రాధే శ్యామ్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ వంటి స్టార్స్ కూడా నటించబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement