Thursday, May 2, 2024

యాంకర్ ప్రదీప్ కు కరోనా ? నిజమేనా !!

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చాలా మంది సినీ స్టార్స్ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే కొంత మంది స్టార్ హీరోలు సెల్ఫ్ ఐసోలాషన్ లోకి వెళ్లారు. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై ఎక్కడ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ప్రస్తుతం ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సరిగమప ది నెక్స్ట్ సింగింగ్ ఐ కాన్ ముగిసింది. అలాగే ఆ తర్వాత ప్రదీప్ డ్రామా జూనియర్స్ సీజన్ 5 కు కూడా యాంకర్ గా చేస్తున్నాడు. కాగా ఈ సీజన్ కు సంబంధించి తాజా ప్రోమో 1 విడుదల అయింది. ఆ ప్రోమో లో ప్రదీప్ మాచిరాజు కనిపించలేదు. ఆ స్థానంలో రవి కనిపించాడు. దీంతో ప్రదీప్ మాచిరాజు కు కరోనా అంటూ వార్త మరింత ఎక్కువగా ప్రచారం అవుతుంది. ఇక ఈ షోలో రేణుదేశాయ్, సునీత, ఎస్ వి కృష్ణారెడ్డి జడ్జ్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement