Thursday, May 2, 2024

ఆరోగ్యశ్రీ రికార్డు: లక్ష మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ బారిన పడిన ప్రజలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు భారీగా డబ్బు గుంజుతున్నాయన్న ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో గతేడాది కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది.

ఆరోగ్యశ్రీ కింద ఏప్రిల్ 22 నాటికి లక్ష మంది కరోనా రోగులకు ఉచిత వైద్యం అందించి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అందరి కంటే ముందు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కింది. దీని కోసం ప్రైవేటు ఆస్పత్రులకు 309 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.

కరోనా వైరస్ వైద్యానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే 2020 జూలైలో కరోనా వైద్య ప్రక్రియలను ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేర్చింది. అలాగే కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు భారీగా డబ్బు గుంజుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న వేళ కరోనా వైద్యానికయ్యే ఫీజులను నిర్ధారించింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement