Sunday, May 19, 2024

తిరుమలలో కుంభవృష్టి..

తిరుమల: తిరుమలలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో గంటన్నరపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జోరుగా కురిసిన వానతో తిరుమల మాడ వీధులు, రహదారులు పూర్తిగా జలమయం అయ్యాయి. భారీగా గాలులు వీయడంతో అనేక చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. శ్రీవారి ఆలయ పరిసరాల్లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంలో భక్తులు తడిసి ముద్దయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement